Udhav thakre: ‘మహా’ సీఎంగా ఉద్ధవ్ థాకరే.. 14-14-14 ఫార్ములాకు కాంగ్రెస్ ఓకే?

  • స్పష్టత కోసం నేడు మరోమారు సమావేశం
  • మంత్రి పదవుల విషయంలో మూడు పార్టీలకు సమాన వాటా
  • ఉద్ధవ్ థాకరే విషయంలో అందరిదీ ఒకే మాట

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు రెడీ అవుతున్నాయి. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఉండడానికి తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎన్సీపీ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని శరద్‌ పవార్ నివాసంలో నిన్న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ ఏర్పాటులో అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని కాంగ్రెస్ పేర్కొంది. ఇందుకోసం 14-14-14 సూత్రాన్ని ప్రతిపాదించింది. మంత్రి పదవుల విషయంలో ఈ సూత్రాన్ని పాటించాలని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. మరోవైపు, ఉద్ధవ్ థాకరేనే ముఖ్యమంత్రి కావాలని పార్టీ ఎమ్మెల్యేలందరూ కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎల్పీ నేత ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు నేడు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.

More Telugu News