Venky Mama: చైతూ పుట్టినరోజున అభిమానులకు 'కెప్టెన్ కార్తీక్' ట్రీట్

  • 'వెంకీమామ'లో వెంకటేశ్ తో కలసి నటిస్తున్న నాగచైతన్య
  • నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు
  • త్వరలోనే సర్ ప్రైజ్ అంటూ చిత్రబృందం పోస్టు

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. అయితే ఈ సినిమా యూనిట్ అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు. సరిగ్గా ఆ రోజునే 'కెప్టెన్ కార్తీక్' ను చూస్తారంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "ఇప్పటివరకు అతని సరదా వైఖరే చూశారు. ఇప్పుడు అతనిలో దేశభక్తిని చూస్తారు. నవంబరు 23న కెప్టెన్ కార్తీక్ ను కలవండి" అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. బహుశా 'కెప్టెన్ కార్తీక్' నాగచైతన్య ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర అయ్యుంటుందని తెలుస్తోంది.

చైతూ పుట్టినరోజు సందర్భంగా 'కెప్టెన్ కార్తీక్ పోస్టర్' ను రిలీజ్ చేస్తే మాంచి క్రేజ్ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News