Venkatesh: వెంకటేశ్ కూడా ఆయన వైపే మొగ్గు చూపాడట

  • ఇటీవల కాస్త వెనకబడిన మణిశర్మ 
  • 'ఇస్మార్ట్ శంకర్' తో సత్తా చాటిన తీరు  
  • చేతికి వస్తున్న భారీ ప్రాజెక్టులు  

తెలుగులో ఇటు బాణీలు కట్టడంలోను .. అటు రీ రికార్డింగును అందించడంలోను మణిశర్మకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కాస్త వెనుకబడ్డారు. ఇటీవల వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' విజయాన్ని సాధించడంలో సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. దాంతో సహజంగానే సీనియర్ స్టార్ హీరోల దృష్టి మళ్లీ ఆయన వైపు వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే కొరటాల - చిరంజీవి సినిమాకి ఆయనను తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ కూడా తన తాజా చిత్రానికిగాను మణిశర్మ పేరునే సూచించినట్టుగా చెప్పుకుంటున్నారు. తమిళంలో ఇటీవల ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' సినిమాను వెంకటేశ్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. 'అసురన్' చూసిన వెంకటేశ్ .. ఆ సినిమా విజయంలో రీ రికార్డింగ్ ముఖ్యమైన పాత్రను పోషించిందనే విషయాన్ని గ్రహించి, తెలుగులో మణిశర్మ అయితేనే కరెక్ట్ అని భావించి ఆయన పేరును సురేశ్ బాబుకి సూచించాడని చెబుతున్నారు.

More Telugu News