Congress: మహారాష్ట్ర విషయాన్ని రేపు తేలుస్తాం: కాంగ్రెస్

  • సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం
  • శుక్రవారం పార్టీ నిర్ణయం వెలువడుతుంది
  • కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్

మహారాష్ట్రలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఉద్దేశమని, ఈ దిశగా శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ ఉదయం సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.

శివసేన - ఎన్సీపీల మధ్య ఓ డీల్ కుదిరితే, ఆపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని, ముందు ఆ రెండు పార్టీలూ ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, శివసేన - ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు సిద్ధమని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో ఈ సాయంత్రం నుంచి మూడు పార్టీల మధ్యా తుది చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News