నేడు యానాంలో జగన్ పర్యటన.. పుదుచ్చేరి ఆరోగ్య మంత్రిని పరామర్శించనున్న సీఎం
- ఈ నెల 7న కన్నుమూసిన మల్లాడి తండ్రి
- నేటి పెద్ద కర్మ కార్యక్రమానికి జగన్ హాజరు
- నిన్న మల్లాడిని పరామర్శించిన జనసేన నేత
మల్లాడి కుటుంబంతో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి మల్లాడి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌కు వైఎస్ విగ్రహాన్ని బహూకరించారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత కస్తూరి సత్యప్రసాద్ (నాని) నిన్న యానాంలో మల్లాడిని పరామర్శించారు.