Aishwarya Rajesh: ఆసక్తిని రేపుతున్న 'మిస్ మ్యాచ్' ట్రైలర్

  • ప్రధాన పాత్రధారిగా ఐశ్వర్య రాజేశ్ 
  • లవ్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ 
  •  డిసెంబర్ 6వ తేదీన విడుదల   

ఉదయ్ శంకర్ .. ఐశ్వర్య రాజేశ్ జంటగా నిర్మల్ కుమార్ దర్శకత్వంలో 'మిస్ మ్యాచ్' రూపొందింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ఫైటర్ గా నటించింది. శ్రీరామ్ రాజు - భరత్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను వదిలారు.

నాయకా నాయికలు .. ఇరు కుటుంబ సభ్యులకి సంబంధించిన కీలక సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కుస్తీ పోటీలలో పాల్గొనే కథానాయిక హీరో ప్రేమలో పడటం, అతనితో పెళ్లికి ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొనడమే అభ్యంతరం కావడం ఈ ట్రైలర్లో చూపించారు.

లవ్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 'కౌసల్య కృష్ణమూర్తి' తరువాత ఐశ్వర్య రాజేశ్ చేసిన ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News