Satyavathi Rathode: మంత్రి సత్యవతిని ఇంటర్వ్యూ చేసిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు

  • స్కూలు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఇంటర్వ్యూ
  • బాలల సంక్షేమం అంశంపై చర్చించానన్న హిమాన్షు
  • ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. తన స్కూలు ప్రాజెక్టు విషయమై ఆమెను ఇంటర్వ్యూ చేసినట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. బాలల సంక్షేమం అంశంపై ఆమెతో చర్చించానని వెల్లడించారు.

మరోవైపు, సత్యవతి మాట్లాడుతూ, బాల నేరస్తుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్నారుల్లో నేర ప్రవృత్తిని అరికట్టాలంటూ వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. జువైనల్ హోంలో ఉన్న తమ పిల్లలను చూసేందుకు వారి తల్లిదండ్రులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్ లోని జువైనల్ హోంను ఆమె సందర్శించారు.
Satyavathi Rathode
KTR
Himanshu
TRS
Interview

More Telugu News