Mahesh Babu: నిన్ను చూస్తే గర్వంగా ఉంది సీతూ!: మహేశ్ బాబు

  • క్వీన్ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్
  • ఎల్వాకు సితార మినీ వర్షన్
  • 22 వరకూ ఆగలేనన్న మహేశ్
ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న 'ఫ్రోజన్-2' చిత్రంలో క్వీన్ ఎల్సా చిన్ననాటి పాత్రకు టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పిందన్న సంగతి తెలిసిందే. డిస్నీ స్టూడియో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

"ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్ గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేను" అని ట్వీట్ చేశారు.
Mahesh Babu
Frogen-2
Sitara
Dubbing
Queel Elsa

More Telugu News