Yamadonga: పుష్కర కాలం తర్వాత తమిళంలోకి ‘యమదొంగ’

  • 2007లో విడుదలైన ‘యమదొంగ’
  • తమిళంలో ‘విజయన్‌’గా రాబోతున్న ఎన్టీఆర్ సినిమా
  • సుదిక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విడుదల

దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమాను తమిళంలోకి అనువదిస్తున్నారు. 2007లో వచ్చిన ఈ సినిమాలో ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌లు కథానాయికలుగా నటించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించగా, కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో ‘విజయన్’గా అనువదిస్తున్నారు. సుదిక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More Telugu News