Lazor: లేజర్ షోను మించిపోయేలా... వందల సంఖ్యలో డ్రోన్లతో అనేక ఆకృతులు!

షార్ట్స్‌లో చూడండి
లేజర్ కిరణాలతో ఆకాశంలో వివిధ రూపాలను సృష్టించడం తెలిసిందే. లేజర్ షోలో సెకన్ల వ్యవధిలో పలు ఆకృతులు రూపుదిద్దుకుంటాయి. అయితే, చైనాలో లేజర్ షోకు దీటుగా 800 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతాలు చేశారు. ఏకకాలంలో 800 మంది డ్రోన్లను గాల్లోకి పంపి, వాటితో యుద్ధ విమానాలు, హెలికాప్టర్, మనిషి, అక్షరాలు వంటి ఆకృతులను సృష్టించారు. ఓ ఆకృతికి రూపం ఇవ్వడం కంటే అన్ని వందల డ్రోన్ల మధ్య సమన్వయమే ఇక్కడ కీలకాంశం. 800 మంది ఆపరేటర్లు ఎంతో కచ్చితత్వంతో డ్రోన్లను ఆపరేట్ చేసి ఆకాశంలో అద్భుత రూపాలు ఆవిష్కరించారు.
Go Back to Shorts
Lazor
Drone
China

More Telugu News