Chandrababu: కోటి దీపోత్సవ వేడుకల్లో చంద్రబాబు ..ఫొటోలు ఇవిగో

  • ఎన్టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకల్లో చంద్రబాబు
  • ఈ ఉత్సవంలో పాల్గొనడం ఆనందదాయకమన్న టీడీపీ అధినేత
  • దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆధ్యాత్మిక గొప్పదనమంటూ వ్యాఖ్య

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, పూరీ పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామివారితో కలిసి కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని చెప్పారు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆధ్యాత్మిక గొప్పదనమని చెప్పారు. కార్తీక మాసం అనగానే శివార్చన, అభిషేకాల మాదిరిగానే కోటి దీపోత్సవం కూడా గుర్తొచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు.

More Telugu News