Tamilnadu: భక్తురాలి చెంప ఛెళ్లుమనిపించి, పరారైన పూజారి!

  • చిదంబరం నటరాజ ఆలయంలో ఘటన
  • అర్చన చేయమన్న మహిళతో గొడవ
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయంలో ఓ పూజారి.. భక్తురాలి చెంపఛెళ్లుమనిపించాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అతడు కనపడకుండా పారిపోయాడు. పూజారికి, ఆ మహిళకు మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

లత అనే మహిళ తన కుమారుడు రాజేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఆలయానికి వెళ్లి, పూజాసామగ్రిని ఆలయ పూజారి దర్శన్ చేతికి ఇచ్చింది. ఆయనను అర్చన చేయమని కోరగా, ఆయన కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి ఇచ్చేశాడు. దీంతో పూజారిని లత ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెను పూజారి కొట్టాడు.

ఈ విషయంపై పూజారిని ప్రశ్నించగా... తన మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కునేందుకు ఆమె ప్రయత్నించిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను ఆమెను అడ్డుకోబోయానని, దీంతో తన చేయి ఆమె చెంపకు తగిలిందని చెబుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పూజారి దర్శన్ పరారీలో ఉన్నాడు.

More Telugu News