Vijayashanthi: విజయశాంతి కోరుకున్నట్టే జరిగిందట

  • తొలినాళ్లలో గ్లామర్ పాత్రలే వచ్చేవి 
  • నటనకి ప్రాధాన్యతగల పాత్రలను విజయశాంతి కోరుకునేవారు 
  • ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసేవారన్న ఈశ్వర్
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ .. విజయశాంతిని గురించి ప్రస్తావించారు. "తొలినాళ్లలో విజయశాంతికి గ్లామర్ ప్రధానమైన పాత్రలే వచ్చేవి. అయితే నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలు రావడం లేదనే అసంతృప్తిని ఆమె నా దగ్గర వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి. అలాంటి విజయశాంతిలో మంచినటి దాగుందనేది టి.కృష్ణగారు ముందుగా గ్రహించారు.

అందువల్లనే 'నేటి భారతం' సినిమాలో ఆమెకి పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. ఆ సినిమాతో ఆమెకి వచ్చిన క్రేజ్ తో, 'ప్రతిఘటన'లోను ఆమెకే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో విజయశాంతి రేంజ్ మారిపోయింది. ఆ తరువాత నాయిక ప్రాధాన్యత కలిగిన పవర్ఫుల్ పాత్రలకి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. తాను కోరుకున్నట్టుగా జరిగిందనే సంతృప్తిని కూడా ఆమె నా దగ్గర వ్యక్తం చేశారు" అని చెప్పుకొచ్చారు.
Vijayashanthi

More Telugu News