Sumanth: నాగ్ చేతుల మీదుగా రానున్న సుమంత్ మూవీ టైటిల్ పోస్టర్

  • సుమంత్ హీరోగా కొత్త చిత్రం 
  • దర్శకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి 
  • త్వరలో పూర్తి వివరాలు

కథానాయకుడిగా సుమంత్ తన కెరియర్ ను ఆరంభించి చాలాకాలమే అయింది. అయితే  'సత్యం' .. 'గోదావరి' వంటి కొన్ని హిట్స్ మాత్రమే తన ఖాతాలో వున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయనను సక్సెస్ అనేదే పలకరించలేదు. దాంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని మంచికథను ఎంపిక చేసుకున్నాడు.

ధనుంజయన్ నిర్మాతగా ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాగార్జున విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సుమంత్ వున్నాడు.  

More Telugu News