snake: అరగంట పాటు పాముతో పోరాడిన ఎలుగు బంటి.. ఆసక్తికరంగా తిలకించిన వీక్షకులు

  • వరంగల్ జంతు ప్రదర్శన శాలలో ఘటన
  • పాముపై దాడి చేసిన భల్లూకం
  • ఎలుగుబంటి నీళ్లు తాగే కొలనులోకి పాము రావడంతో దాడి

వరంగల్ జంతు ప్రదర్శనశాలలో ఓ పాముపై ఎలుగు బంటి దాడి చేసింది. దాదాపు అరగంట పాటు ఆ రెండు పోరాడడంతో  జంతు ప్రదర్శనశాలకు వచ్చిన వారంతా కదలకుండా వాటినే చూస్తూ ఉండిపోయారు. ఓ పాము ఎలుగుబంటి నీళ్లు తాగే కొలనులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎలుగు బంటి వెంటనే దాడి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేసింది.

ఎలుగు బంటి బారి నుంచి తప్పించుకోవడానికి పాము నానా విధాలుగా ప్రయత్నాలు జరిపింది. అయినప్పటికీ దాన్ని వెంటాడుతూ ఎలుగు పరుగులు తీసింది. చివరకు ఆ పాము ఎలుగు బారి నుంచి తప్పించుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పోరును వీక్షకులు ఆసక్తికరంగా తిలకించారు. 

More Telugu News