Congress: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం!

  • శివసేనకు సీఎం, ఎన్సీపీ, కాంగ్రెస్ లకు డిప్యూటీ సీఎం పదవులు
  • ఒప్పందానికి సోనియా, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే అంగీకారం
  • ఈ నెల 17న  ప్రభుత్వ ఏర్పాటు? 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్ మినిమం ప్రోగ్రాం) శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల అధినేతలు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం వారు గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఒప్పుకున్నాయి. ఇక కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అంగీకారం తెలిపారు.

శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శివసేనకు సీఎం పదవి సహా 14 మంత్రి పదవులు, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 17న ఏర్పడనుందని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.

More Telugu News