Shiv Sena: మరో 25 ఏళ్లు మహారాష్ట్ర సీఎంగా శివసేన నేత!: సంజయ్ రౌత్

  • కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన చర్చలు
  • తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
  • సీఎం పదవిపై స్పందించిన సంజయ్ రౌత్
  • ఐదేళ్ల గురించి  మాత్రమే ఎందుకు చర్చించుకోవాలి? అని వ్యాఖ్య

'మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే' అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శివసేన నేత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా? లేదా ఐదేళ్లు ఉంటారా? అన్న ప్రశ్నకు స్పందించారు. 'ఐదేళ్ల గురించి ఎందుకు చర్చించుకోవాలి? మరో 25 ఏళ్లు మహారాష్ట్రకు సీఎంగా శివసేన నేతే ఉండాలని మేము కోరుకుంటున్నాం' అని వ్యాఖ్యానించారు.

ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చల విషయంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ... 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తుది నిర్ణయం తీసుకుంటారు. మాలో ఏ పార్టీ అధిక సీట్లు సాధించిందో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది' అని  వ్యాఖ్యానించారు. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ముగిశాయని తెలుస్తోంది. ఐదేళ్ల పాటు శివసేన నేతే సీఎంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

More Telugu News