Rahul Gandhi: దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్

  • ప్రధానిని మాత్రమే రాహుల్ దొంగ అనలేదు
  • ఫ్రాన్స్ ప్రధాని వ్యాఖ్యలను కూడా తప్పుగా ప్రచారం చేశారు
  • తనను తాను రక్షించుకునేందుకే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు

ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ 'కాపలాదారుడే దొంగ' అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం దావాను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ కు సూచించింది. సుప్రీంకోర్టు కేసును కొట్టేసినప్పటికీ... బీజేపీ నేతలు మాత్రం రాహుల్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు.

దేశ ప్రజలందరికీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధానిని దొంగ అని మాత్రమే అనలేదని... ఫ్రాన్స్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా అబద్ధాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా తప్పుగా ప్రచారం చేశారని విమర్శించారు.

పరువునష్టం దావాను సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ... దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 'మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. అదే క్షమాపణను దేశ ప్రజలకు చెప్పగలరా?' అంటూ రాహుల్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

More Telugu News