neela sahni: ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ

  • ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నుంచి బాధ్యతల స్వీకరణ
  • 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి నీలం సాహ్ని
  • ఉమ్మడి ఏపీలో మహిళా సీఎస్ లుగా సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ  

నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ ప్రభుత్వ మహిళా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నుంచి సాహ్ని ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటివరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి.

గతంలో  నీలం సాహ్ని కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, అనంతరం ఏపీఐడీసీ వీసీ అండ్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహించి, ఆ తర్వాత స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగానూ పనిచేశారు. గతేడాది నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

More Telugu News