Fire Accident: ఉత్తరప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు

  • టర్బైన్ జనరేటర్ యూనిట్ లో ఘటన
  • తీవ్రంగా గాయపడిన నలుగురు ఇంజనీర్లు
  • క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం టర్బైన్ జనరేటర్ యూనిట్ లో చోటు చేసుకున్న పేలుడు ఘటన కారణంగా అక్కడ పనిచేస్తున్న నలుగురు ఇంజనీర్లు తీవ్రంగా గాయపడ్డారు. సోనే భద్ర జిల్లాలో ఉన్న ఈ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి విధుల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోగా గాయపడిన ఇంజనీర్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. 


కాగా ప్రమాదం జరిగిన వెంటనే అధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో మంటల్ని అదుపు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంట్ లో ప్రమాదం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆరు నెలలపాటు అంతరాయం కలగనుందని అధికారవర్గాల సమాచారం.

Fire Accident
dharmal station
Uttar Pradesh
four injured

More Telugu News