sand scarcity: ఇసుక కొరత వైసీపీ ప్రభుత్వం సృష్టించిందే: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • పార్టీ నేతల అక్రమార్జన మార్గం
  • ఇప్పుడు ఇసుక వారోత్సవాలు సిగ్గుచేటు
  • ఇప్పటికైనా తప్పు సవరించుకోవాలని సూచన

తమ పార్టీ నేతల అక్రమార్జన కోసం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక కొరత కావాలని సృష్టించిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన కడపలో మాట్లాడుతూ ఇదంతా వైసీపీ ఇసుకాసురుల పన్నాగమని ధ్వజమెత్తారు. అన్నీ చేసి, కూలీల జీవితాలు రోడ్డున పడిన తర్వాత ఇసుక వారోత్సవాలంటూ ప్రభుత్వం హడావుడి చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జరిగిన తప్పును సవరించుకుని ఇసుకను సమృద్ధిగా అందుబాటులోకి తేవాలని, కూలీల జీవితాలను నిలబెట్టాలని హితవు పలికారు.

sand scarcity
tulasireddy
YSRCP

More Telugu News