Roja Ramani: చంద్రమోహన్ గారు ఇలాంటి గమ్మత్తులు చాలానే చేసేవారు: సీనియర్ నటి రోజా రమణి

  • చంద్రమోహన్ గారితో ఎక్కువ సినిమాలు చేశాను 
  •  అప్పట్లో ఆయన చాలా బిజీగా ఉండేవారు 
  • పెట్టుడు మీసం పోయిందని అలా చేశారన్న రోజా రమణి 
తెలుగు తెరపై నటిగా రోజా రమణి మంచి పేరు తెచ్చుకున్నారు. తన కెరియర్లో ఆమె చంద్రమోహన్ తో ఎక్కువ సినిమాలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె చంద్రమోహన్ గురించి మాట్లాడుతూ ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు.

"చంద్రమోహన్ గారు అప్పట్లో చాలా బిజీగా ఉండేవారు. మూడు షిఫ్టులలో ఆయన పనిచేసేవారు. ఒక షూటింగ్ నుంచి మరో షూటింగుకి చాలా గమ్మత్తుగా వెళ్లిపోయేవారు. ఒకసారి ఓ సినిమా షూటింగు జరుగుతుండగా, బ్రేక్ టైమ్ లో తన పెట్టుడు మీసం ఎక్కడో పడిపోయిందని ఆయన చెప్పారు. అంతా దానికోసం వెతకడం మొదలుపెట్టారు. రెండు గంటల తరువాత ఆయన మీసాలు పెట్టుకుని వచ్చారు. 'ఎక్కడ పడిపోయాయి?' అని అడిగాను నేను. 'ఎక్కడా పడిపోలేదు .. నా జేబులోనే వున్నాయి .. ఈలోగా మరో షూటింగ్ పూర్తి చేసి వచ్చా" అంటూ అసలు విషయం చెప్పారాయన. ఇలాంటి గమ్మత్తులు ఆయన చాలానే చేసేవారు"అని చెప్పుకొచ్చారు.
Roja Ramani
Chandra Mohan

More Telugu News