Kirak: రవితేజ 'క్రాక్' షూటింగ్ మొదలైంది!

  • రవితేజ సరసన శ్రుతి హాసన్ 
  • మలినేని గోపీచంద్ దర్శకత్వం
  • తొలిషాట్ కు రాఘవేంద్రరావు దర్శకత్వం

 రవితేజ హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'క్రాక్' ఇప్పుడు ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.. తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ టాప్ ట్రెండింగ్ లోకి చేరిపోయిందని చెబుతూ, సినీ పిఆర్వో, నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.కాగా, ఈ సినిమా షూటింగ్ ముహూర్తం నేడు జరిగింది. అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడికి దిల్ రాజు, సురేందర్ లు అందించగా, రాఘవేంద్రరావు తొలి షాట్ కు దర్శకత్వం వహించారు.

More Telugu News