ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా నీలం సాహ్ని నియామకం.. నేడే బాధ్యతల స్వీకరణ!

- నవ్యాంధ్రకు తొలి మహిళా ప్రధాన కార్యదర్శి
- 1984 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి
- గతంలో పలు విభాగాల్లో విధులు
1984వ ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి అయిన నీలం సాహ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు విభాగాల్లో విధులను నిర్వర్తించారు. మచిలీపట్నం ,టెక్కలిలో అసిస్టెంట్ కలెక్టర్ గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా పనిచేశారు. మున్సిపల్ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గానూ సేవలందించారు.