winter season: తెలంగాణలో పంజా విసురుతున్న చలి!

  • ప్రజలను వణికిస్తున్న చలిగాలులు
  • చుక్కాపూర్‌లో అత్యల్పంగా 13.5 డిగ్రీల నమోదు
  • ఈ శీతాకాలంలో ఇదే తొలిసారి

తెలంగాణలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత దిగజారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో నిన్న తెల్లవారుజామున 13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్‌లో 14.8, ఆదిలాబాద్‌లో 15.2, హైదరాబాద్‌లో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శీతాకాలం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

More Telugu News