Sensex: మార్కెట్లకు భారీ నష్టాలు

  • ట్రేడింగ్ చివర్లో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 229 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 73 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అయినప్పటికీ... 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. మాక్రోఎకనామిక్ డేటా విడుదలకానున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 229 పాయింట్లు పతనమై 40,116కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 11,840కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (3.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.48%), ఎన్టీపీసీ (0.30%), మారుతి సుజుకి (0.25%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.64%), యాక్సిస్ (-3.22%), వేదాంత లిమిటెడ్ (-3.02%), సన్ ఫార్మా (-2.29%).

More Telugu News