ORR: ఎదురుగా వచ్చిన కారులోని వారు గుర్తుపట్టి, నన్ను కారులోంచి బయటకు తీశారు: రాజశేఖర్

  • ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదం
  • కారులో ఉన్నది నేను ఒక్కడినే
  • తొలుత పోలీసులకు సమాచారం ఇచ్చానన్న రాజశేఖర్
ఈ తెల్లవారుజామున హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఘటనలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని రాజశేఖర్ వెల్లడించినట్టు సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే సమయంలో రాజశేఖర్ మాట్లాడారంటూ, ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు.

"మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా, ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ, అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనేనని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లో నుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తరువాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడి నుంచి వారి కారులోనే ఇంటికి బయలుదేరాను. జీవిత, నా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలూ కాలేదు" అని తెలిపారు.
ORR
Rajasekhar
Car Accident
Hyderabad
Police

More Telugu News