ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే జైలుకే: జగన్ కీలక ఆదేశాలు
- ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180కి పెంచాలి
- ఎల్లుండిలోగా ఇసుక రేటు కార్డును నిర్ణయించాలి
- సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టండి
నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఎల్లుండిలోగా ఇసుక రేటు కార్డును నిర్ణయించాలని... ఎక్కువ ధరకు ఇసుకను అమ్మేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్ పోస్టులు పెట్టాలని ఆదేశించారు. 10 రోజుల్లోగా చెక్ పోస్టులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు.