'ఇంగ్లీషు మీడియం' అంశంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్
- ఏపీలో రగులుతున్న ఇంగ్లీషు మీడియం అంశం
- అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సీఎం జగన్
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైసీపీ ఇంగ్లీషు మీడియం ప్రతిపాదనపై విరుచుకుపడిందని ఆరోపిస్తూ, 'మాతృభాషకు మంగళం' అంటూ 'సాక్షి'లో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. అంతేకాదు, 'ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా?' అంటూ మరో కథనాన్ని కూడా ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడు వైసీపీ కపట ధోరణికి ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు.