భారత మార్కెట్లో మరో మోడల్ తీసుకువచ్చేందుకు ఆడి సన్నాహాలు

10-11-2019 Sun 15:51
  • ఆడి నుంచి క్యూ8 ఎస్ యూవీ మోడల్
  • ఆర్డర్లు ప్రారంభం
  • బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కొత్త కారు

ప్రీమియం సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి భారత్ లో మరో కొత్త మోడల్ తీసుకువస్తోంది. ఆడి క్యూ8 కారును వచ్చే జనవరిలో భారత విపణిలో ప్రవేశపెట్టనుంది. క్యూ8 ఎస్ యూవీ మోడల్ కావడంతో ఉన్నతశ్రేణికి చెందిన యువత బాగా ఇష్టపడతారని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది బీఎస్-6 ప్రమాణాలతో వస్తోంది. ప్రస్తుతం దీనికి ఆర్డర్లు తీసుకుంటున్నట్టు కంపెనీ వర్గాలంటున్నాయి. రాబోయే ఆరేళ్లలో మరిన్ని అమ్మకాలు జరపాలన్నది తమ లక్ష్యమని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ఆడి క్యూ8 రాకతో తమ లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నామని అన్నారు.