Facebook: పాటపాడుతూ రక్త పరీక్ష కోసం చిన్నారి రక్తాన్ని తీసిన వైద్యుడు.. నొప్పి తెలియకుండా టెక్నిక్.. వీడియో వైరల్

  • స్కాట్లాండ్ లో ఘటన
  • కొంచం కూడా ఏడవని పాప
  • ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన తల్లి

అనారోగ్యానికి గురయినప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే.. వారు వేసే ఇంజక్షన్ ను చూసి చాలా మంది భయపడిపోతారు. ఇక చిన్నారుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే, స్కాట్లాండ్ లో  ఓ వైద్యుడు.. చిన్నారికి నొప్పి తెలియకుండా పాట పాడుతూ ఇంజక్షన్ ను పొడిచి రక్తం తీసిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

షానన్‌ అనే మహిళ తన పాపకు  రక్తపరీక్ష చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో డాక్టర్ ర్యాన్ కోట్జీ..  'అన్‌ఫర్‌గెటబుల్‌' అనే పాట పాడుతూ రక్తం తీశాడు. దీంతో ఆ పాప అస్సలు ఏడవలేదు. తన బిడ్డకు నొప్పి తెలియకుండా ఆ వైద్యుడు పాట పాడినందుకు కృతజ్ఞతలు అంటూ షానన్ తన ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వైద్యుడు చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఫేస్ బుక్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News