దొంగల స్వైరవిహారం... నాలుగు గ్రామాల్లోని 12 ఇళ్లలో దొంగతనం!
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
- ఈ తెల్లవారుజామున దొంగతనాలు
- వివరాలు సేకరించిన పోలీసులు
సాయిగూడెం, కొళ్లూరు, చారాజీపేట, టంగుటూరు గ్రామాల్లో ఈ దొంగతనాలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగతనాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి, వివరాలు సేకరించారు. దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు. అన్ని దొంగతనాలూ నేటి తెల్లవారుజామునే జరిగాయని వెల్లడించారు.