శోభన్ బాబు గారు టైమ్ అంటే టైమే: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ
- మంచి మనసున్న మనిషి శోభన్ బాబు
- సమయపాలనలో కచ్చితంగా ఉండేవారు
- గ్లామర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారన్న రాజశ్రీ
శోభన్ బాబుగారు ఒక పద్ధతి గల మనిషి .. మంచి మనసున్న మనిషి. సమయపాలనకి ఆయన ఎక్కువ విలువనిచ్చేవారు. అలాగే తన గ్లామర్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. రాత్రివేళ షూటింగ్స్ ఒప్పుకునేవారు కాదు .. అప్పట్లో రాత్రి 9 దాటితే ఒక్క నిమిషం కూడా సెట్లో ఉండేవారు కాదు. 'ఒక్క షాట్ వుంది సార్ .. వెంటనే అయిపోతుంది' అని ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆగేవారు కాదు. రాత్రివేళలో మెలకువతో వుండి షూటింగ్ చేస్తే, మరుసటి రోజు కెమెరాలో లుక్ 'డల్'గా కనిపిస్తుందని ఆయన భావించేవారు" అని చెప్పుకొచ్చారు.