Crime News: మరో ఇద్దరి ప్రాణాలు తీసినట్టు సీరియల్‌ కిల్లర్ సింహాద్రిపై బంధువుల ఫిర్యాదు

  • గోదావరి జిల్లాల్లో రెండు కేసుల నమోదు
  • ఏలూరులో ఒకరిని, పురుషోత్తపట్నంలో ఒకరిని చంపినట్టు కేసు
  • ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సింహాద్రి
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో నిండామునిగి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అడ్డగోలుగా అడ్డదారిలో సంపాదించాలని హత్యలకు తెరతీసిన సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రి మరో ఇద్దరిని చంపినట్లు తాజాగా ఫిర్యాదులు అందాయి. డబ్బు, బంగారం దోచుకునేందుకు దేవుని ప్రసాదంలో సైనేడ్‌ కలిపి ఇస్తూ ఇరవై నెలల వ్యవధిలో 10 మందిని సింహాద్రి అలియాస్‌ శివ చంపినట్లు బయటపడడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతను హత్య చేసినట్లుగా భావిస్తున్న వారిలో ఏడుగురికి చెందిన వారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ముగ్గురి బంధువుల నుంచి ఫిర్యాదులు అందలేదు.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒకరిని, తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో మరొకరిని హత్య చేసినట్లు మృతుల బంధువులు ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇతని చేతిలో చనిపోయిన చోడవరపు సూర్యనారాయణకు సంబంధించి ఏలూరు పోలీసులకు ఫిర్యాదు అందగా, పురుషోత్తపట్నంలో రామకృష్ణ స్వామీజీ హత్యకు సంబంధించి సీతానగరం పోలీసులకు ఫిర్యాదు అందింది.
Crime News
serial killar
simhadri
two cases

More Telugu News