Jagan: అయోధ్య తుది తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందన

  • తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేశాయి
  • ఆ తర్వాతే తీర్పు వెలువడింది
  • రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు
అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. 'అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది' అని అన్నారు.

'ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరు సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.
Jagan
YSRCP

More Telugu News