Andhra Pradesh: ప్రపంచంతో పోటీపడాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరం: ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్

  • అన్ని విషయాలపై చర్చించే నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి
  • గ్రామీణ, పేద విద్యార్థులకు ఉపకరిస్తుందని వెల్లడి
  • వచ్చే ఏడాది నుంచి క్రమంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని వివరణ

అన్ని విషయాలపై చర్చించిన తర్వాతే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలన్న నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన సాగాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీష్ భాషమీద పట్టు అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు నైపుణ్యముందని.. పేద విద్యార్థులను అభివృద్ధి చేయడానికి వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి అని పేర్కొన్నారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచి క్రమంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు.

More Telugu News