Jagan: ఈ నెల 10న కృష్ణా నది ఒడ్డున మహా రుద్రాభిషేకం.. ముఖ్య అతిథిగా సీఎం జగన్!

  • మహా రుద్రాభిషేకంతో పాటు మహా భష్మాభిషేకం  
  • 8 అడుగుల మృతికా (మట్టి ) శివలింగానికి ప్రత్యేక పూజలు 
  • సీఎంతో పాటు హాజరుకానున్న ఇతర నాయకులు

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10న విజయవాడ నగరంలోని కృష్ణానది ఒడ్డున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకంతో పాటు మహా భష్మాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. కార్తీక మాసం సందర్భంగా లోక కల్యాణార్థం రుద్రాభిషేకంలో అత్యంత ఘనంగా 8 అడుగుల మృతికా (మట్టి ) శివ లింగానికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం నాగ సాధువులతో, వేద పండితులతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొననున్నారు.

More Telugu News