Gold Mine: కుప్పకూలిన బంగారు గని... పది మంది మృతి!

  • ఈశాన్య గనియాలో దుర్ఘటన
  • పలువురి గల్లంతు
  • సహాయక చర్యలు మొదలు

గనియా దేశంలో జరిగిన ఘోర దుర్ఘటన పదిమంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ సమయంలో గనిలో ఖనిజాన్ని వెలికితీస్తున్న వారిలో 10 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. ఈ విషయాన్ని వెల్లడించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఎంతో మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది.

More Telugu News