Telugudesam: టీడీపీ వాట్సాప్ గ్రూపులో రాజీనామా లేఖ పోస్ట్ చేసిన యామిని సాదినేని!

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన యామిని
  • బలమైన కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
  • టీడీపీలో అంతర్గత విభేదాలున్నాయంటూ వ్యాఖ్యలు
ఎన్నికల ముందు టీడీపీ తరఫున బలమైన గొంతుక వినిపించిన మహిళా నేత యామిని సాదినేని పార్టీకి వీడ్కోలు పలికారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న పరిస్థితులు, ఇతర పరిణామాలు బలంగా ప్రభావం చూపుతున్నాయని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందని యామిని పేర్కొన్నారు.

పార్టీలోనూ నేతల మధ్య సఖ్యత లోపించిందని, అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు యామిని తన రాజీనామా లేఖను టీడీపీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. కాగా, యామిని బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం!
Telugudesam
Telugudesam
Sadineni Yamini
Andhra Pradesh
BJP

More Telugu News