cpm: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు సీఎం జగన్ పరామర్శ

  • మధు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జగన్
  • ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం నేత
  • డిశ్చార్జి తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మధు
ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును సీఎం జగన్ పరామర్శించారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి మధుతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రాధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా వున్నారు. కాగా, విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధు మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
cpm
Andhra Pradesh
secretary P.Madhu
CM Jagan
Enquiry on Madhu Health

More Telugu News