Hyderabad: మామూళ్ల మత్తులో పోలీసులు... ఆరుగురిని సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్!

  • హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు
  • కస్టమర్లను బెదిరించి డబ్బు వసూలు
  • విషయం తెలిసి సీరియస్ అయిన అంజనీకుమార్
మామూళ్ల మత్తులో జోగుతున్న హైదరాబాద్ పోలీసులపై పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. నలుగురు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలను ఆయన విధుల నుంచి తొలగించారు. నగరంలోని పలు హుక్కా సెంటర్లు రాత్రి వేళల్లో అక్రమంగా నడుస్తున్నాయన్న సమాచారంతో వీరంతా దాడులకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. దాడులకు వెళ్లిన వీరు, అక్కడి కస్టమర్లను, నిర్వాహకులను బెదిరించి మామూళ్లు వసూలు చేశారు. ఈ విషయంలో కొందరు బాధితులు అంజనీకుమార్ కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. శాఖాపరమైన విచారణ జరిపి, ఎస్సైలు కురుమూర్తి, శ్రీను, శంకర్, రామకృష్ణ, ఏఎస్ఐలు మహ్మద్ జాఫర్, శామ్యూల్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Hyderabad
Hukkah
Anjanikumar
police
Suspend

More Telugu News