vijaya Saireddy: 'నిత్య కల్యాణం... పావలా' అంటూ విమర్శల జల్లు కురిపించిన విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా ‘నిత్య కల్యాణా’నికి పోయేదేమీ లేదు
  • ప్యాకేజీ ముడితే ఎప్పటి లాగే జగన్ పై విషం కక్కుతుంటాడు
  • పావలా, రూపాయి లెక్కలు తప్ప రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు ఆయనకు
  • పచ్చ మీడియా చూపిస్తుంది కదా అని యాక్షన్ ఇరగదీస్తున్నాడు 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి విమర్శల జల్లు కురిపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విషం కక్కుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ ను 'ప్యాకేజీ స్టార్' అంటూ సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి ఈ విమర్శల ఘాటును మరింత పెంచారు.
 
'చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ‘నిత్య కల్యాణా’నికి పోయేదేమీ లేదు. ప్యాకేజీ ముడితే ఎప్పటి లాగే జగన్ పై విషం కక్కుతుంటాడు. పావలా, రూపాయి లెక్కలు తప్ప రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు ఆయనకు. పచ్చ మీడియా చూపిస్తుంది కదా అని యాక్షన్ ఇరగదీస్తున్నాడు' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.
vijaya Saireddy
YSRCP
Telugudesam

More Telugu News