Tamilnadu: 14వ తేదీన సెల్ ఫోన్ వాడవద్దట.. విద్యార్థుల తల్లిదండ్రులకు తమిళ సర్కారు విజ్ఞప్తి!

  • 14న బాలల దినోత్సవం
  • ఫోన్లు పక్కనబెట్టి పిల్లలతో గడపండి
  • తమిళనాడు విద్యా శాఖ సర్క్యులర్
ఈ సంవత్సరం చిల్ట్రన్స్ డే సందర్భంగా 14వ తేదీన తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి, పిల్లలతో ఆనందంగా గడపాలని, ఆహ్లాదంగా ఉండాలని తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకూ ఓ సర్క్యులర్‌ పంపింది. 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తరఫున,  సెల్‌ ఫోన్లను లేకుండా రోజంతా గడపాలని కోరింది.

ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సెల్‌ ఫోన్లను స్విచాఫ్‌ చేయాలని, రోజంతా పిల్లలతోనే ఉండాలని, కనీసం వారంలో ఒకసారి ఫోన్లను పక్కనబెడితే మరింత బాగుంటుందని అభిప్రాయపడింది. ఈ విషయంలో చిన్నారులే తల్లిదండ్రులపై ఒత్తిడి తేవాలని కోరింది.
Tamilnadu
Childrens Day
Cellphone

More Telugu News