Rajanikant: రజనీకాంత్ ఇంటికి వెళ్లిన తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దంపతులు!

  • భార్య ఆర్తి రెడ్డితో కలిసి రజనీ ఇంటికి
  • పలు రాజకీయ అంశాలపై చర్చలు!
  • మర్యాద పూర్వకమేనన్న రోహిత్ రెడ్డి
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన భార్య ఆర్తి రెడ్డిలు కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన రోహిత్ రెడ్డి దంపతులు, పలు రాజకీయ అంశాలతో పాటు కుటుంబ బాగోగులు మాట్లాడుకున్నట్టు తెలిసింది. తాము రజనీకాంత్ ను మర్యాద పూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, గత సంవత్సరం తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, టీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డిపై విజయం సాధించిన రోహిత్ రెడ్డి, ఆపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Rajanikant
Rohit Reddy
Tandur

More Telugu News