Nokia: సరికొత్త వ్యాపారంలో ప్రవేశిస్తున్న నోకియా

  • స్మార్ట్ టీవీల రంగంలో అడుగుపెడుతున్న నోకియా
  • ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలకు కుదిరిన ఒప్పందం
  • దేశీయంగా తయారైన టీవీలు నోకియా బ్రాండ్ పై విక్రయం

మొబైల్ ఫోన్ అంటే నోకియానే అన్నంత స్థాయిలో కొంతకాలం వరకు చక్రం తిప్పిన ఈ వ్యాపార దిగ్గజం తాజాగా సరికొత్త వ్యాపారంలో అడుగుపెడుతోంది. ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్న స్మార్ట్ టీవీల రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నోకియా సన్నద్ధమవుతోంది. నోకియా బ్రాండ్ పై వచ్చే ఈ స్మార్ట్ టీవీలు కేవలం ఫ్లిప్ కార్ట్ ఈ-కామర్స్ సైట్లోనే లభ్యమవుతాయి. ఈ అత్యాధునిక స్మార్ట్ టీవీల్లో సుప్రసిద్ధ జేబీఎల్ స్పీకర్లు ఉపయోగించనున్నారు. తద్వారా అత్యంత స్పష్టమైన ధ్వని వినియోగదారులకు సరికొత్త అనుభూతినిస్తుంది.

అయితే, నోకియా ఈ స్మార్ట్ టీవీలను సొంతంగా తయారుచేయడంలేదు. దేశీయంగా తయారైన టీవీలను తన బ్రాండ్ పై విక్రయించనుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్, నోకియా మధ్య ఒప్పందం కుదిరింది. నమ్మకం, నాణ్యతలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నోకియాకు ఇది చారిత్రాత్మక అధ్యాయంగా భావిస్తున్నామని నోకియా బ్రాండ్ ఉపాధ్యక్షుడు విపుల్ మెహ్రోత్రా పేర్కొన్నారు.

More Telugu News