అన్ బిలీవబుల్, మైండ్ పోతోంది... జగన్ ఇంటి కిటికీలకు రూ.73 లక్షలా?: నారా లోకేశ్ విస్మయం

  • నెలకు రూపాయి జీతమని ఎంత మోసం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • ఆదేశాల ప్రతిని ట్విట్టర్ లో ఉంచిన టీడీపీ నేత
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని చెబుతున్న సీఎం జగన్, తన ఇంటి కిటికీల కోసం రూ.73 లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పొందడం ఎంత మోసం! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

"సరిగా వినండి, నేను మళ్లీ ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. జగన్ నివాసంలో కిటికీల ఏర్పాటుకు రూ.73 లక్షలు కేటాయించారు. అన్ బిలీవబుల్, మైండ్ పోతోంది..." అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, తన ట్వీట్ లో దీనికి సంబంధించిన ఆదేశాల ప్రతిని కూడా పొందుపరిచారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Windows

More Telugu News