Sensex: బుల్ రంకెలు.. ఆల్ టైమ్ హైకి చేరుకున్న సెన్సెక్స్

  • 222 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 49 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభాలను నమోదు చేసిన బ్యాంకింగ్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఒకానొక సమయంలో దాదాపు 570 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఏకంగా 40,607కి ఎగబాకింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజాలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతోందన్న వార్తల నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ క్రమంలో ఈరోజ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 40,470కి పెరిగింది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 11,966 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.47%), ఇన్ఫోసిస్ (2.39%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.76%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.42%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.45%), ఓఎన్జీసీ (-1.09%), బజాజ్ ఫైనాన్స్ (-1.08%), మారుతి సుజుకి (-1.07%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.06%).

More Telugu News