Ayodhya Case: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: మౌలానా అర్షాద్ మద్ని

  • 400 ఏళ్ల నుంచి బాబ్రీ మసీదు ఉంది
  • మసీదు ఎప్పటికీ మసీదే
  • ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారు

అయోధ్య భూవివాదం కేసులో తీర్పు వెలువడనున్న తరుణంలో జమాయత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షాద్ మద్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఏళ్ల నుంచి అయోధ్యలో బాబ్రీ మసీదు ఉందని... మసీదు ఎప్పటికీ మసీదేనని ఆయన అన్నారు. అయితే, చారిత్రక ఆధారాలతో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు భయానక వాతావరణంలో నివసిస్తున్నారని అన్నారు.

ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈలోగానే ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో తీర్పును వెలువరించబోతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం 4 వేల మందితో కూడిన అదనపు పారామిలిటరీ బలగాలను అక్కడకు తరలిస్తోంది.

More Telugu News