TSRTC: ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలి: ఎంపీ బండి సంజయ్‌

  • గడువు విధించినా కార్మికులు పట్టించుకోలేదు
  • ఇక చర్చలు జరిపి ప్రభుత్వం బాధ్యతగా వ్యహరించాలి
  • కార్మికుల మృతి బాధాకరం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం ఓ మెట్టుదిగి వచ్చి కార్మికులతో చర్చలు జరపాలని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ‘విధుల్లో చేరండి...లేదంటే ఉద్యోగం పోతుంది’ అని డెడ్‌లైన్‌ విధించినా కార్మికులు తొణక లేదు, బెణక లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గుర్తించి కార్మికులతో చర్చించాలని కోరారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కార్మికుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ డిపో-2కు చెందిన ఆర్టీసీ కార్మికుడు కరీంఖాన్‌ గుండె నొప్పితో చనిపోవడం తీరని ఆవేదన మిగిల్చిందన్నారు. గుండెనొప్పి రావడంతో నాలుగు రోజుల క్రితం ఆసుపతిల్రో చేరిన కరీంఖాన్‌ ఇవాళ ఉదయం కన్నుమూశాడు. ఈ పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం చూపి జరుగుతున్న మరణాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎంపీ అన్నారు.

More Telugu News