డెడ్ లైన్ ను పట్టించుకోని కార్మికులు.. ఆర్టీసీ ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ

షార్ట్స్‌లో చూడండి
తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువు నిన్న అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్ లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
KCR
TRS
RTC Strike

More Telugu News